Priyamani: పుట్టబోయే పిల్లలపైనా అలాంటి కామెంట్స్ చేస్తున్నారు: ప్రియమణి 1 y ago
వివాహం చేసుకున్నప్పటినుంచి కొందరు ప్రజలు తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని నటి ప్రియమణి అన్నారు. తనకు పుట్టబోయే పిల్లలపైనా కామెంట్స్ చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. "నాకు ఎంగేజ్మెంట్ జరగ్గానే నా వాళ్లు ఆనందిస్తారని అనుకున్నా. కానీ, అప్పటినుంచి నాపై ద్వేషం ప్రారంభమైంది. లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చాయి. పిల్లలు పుట్టాక వారిని ఐసిస్ లో జాయిన్ చేస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అవి ఎంతగానో బాధ పెడుతున్నాయి. కానీ నేను అలాంటివాటిని పట్టించుకోను" అని ప్రియమణి అన్నారు.